PM Kisan 20th Installment 2025 : రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల విడుదల మే-జూన్‌లో విడుదల. వెంటనే Ekyc చెక్ చేసుకోండి
PM Kisan 20th Installment 2025 : రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల విడుదల మే-జూన్‌లో విడుదల. వెంటనే Ekyc చెక్ చేసుకోండి
PM Kisan 20th Installment 2025 : రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Yojana) 20వ విడత విడుదలను త్వరలోనే చేయబోతోంది. మే లేదా జూన్ 2025 నాటికి ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేల రూపాయలు జమ కానున్నాయి. ఎందుకు రైతులు తప్పక Ekyc పూర్తిచేయవలసి వుంటుంది.
9.8 కోట్ల రైతులకు లబ్ధి
ఈ పథకంతో దేశవ్యాప్తంగా సుమారు 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 19వ విడతలో రూ.22,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం బదిలీ చేసి. ప్రస్తుతం 20వ విడత విడుదలకు సిద్ధమవుతోంది.
ఈకేవైసి పూర్తి చేయుటలో నిర్లక్ష్యం వద్దు
:
ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకపోతే రైతులకు 20వ విడత డబ్బులు ఖాతాలోకి జమ కావు. కావున వెంటనే ఈ ప్రక్రియను అర్హత
గల రైతులు పూర్తి చేయాలి.
ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ – పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో.
బయోమెట్రిక్ ఇ-కేవైసీ – మీకు దగ్గరలోని CSC సెంటర్‌లో.
ఫేస్ అథెంటికేషన్ ఇ-కేవైసీ – పీఎం కిసాన్ యాప్ ద్వారా. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పక అవసరం.
PM Kisan అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్ళండి.
Farmers Corner సెక్షన్‌లో Know Your Statusపై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి, Get Dataపై క్లిక్ చేయండి.
అర్హతలు ఎవరికి?
సాగుకు అనువైన భూమి కలిగిన రైతు కుటుంబాలకు అర్హత ఉంది.
కుటుంబ సభ్యలను కలపి ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
అధిక ఆదాయ వర్గాల రైతులకు, పీయం కిసాన్ నియమ నిబంధనల మేరకు అర్హత లేనివారికి ఈ పతకం వర్తించదు.
త్వరలో 20వ విడత డబ్బులు మీ అకౌంట్లోకి!
అన్ని అర్హతలు వున్నా ఈకేవైసి పూర్తి చేయని వారికి లబ్ది చేకూరదు. కాబట్టి ఈకేవైసి తప్పక పూర్తిచేసుకుని రైతులకు అందించే రైతు చేయూత సొమ్మును పొందవచ్చు.
మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం తప్పక సహాయ న్యూస్ బ్లాగ్ తప్పక ఫాలో చేయండి.

కామెంట్‌లు